Telangana
పరిగి డిపో మేనేజర్ పై మేనేజింగ్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసిన
Quick Summary:
టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. హనుమంత్ ముదిరాజ్
పరిగి డిపో మేనేజర్ ఇషాక్ బిన్ హమ్మద్ పై టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. హనుమంత్ ముదిరాజ్ సోమవారం టీజీఎస్ ఆర్టీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హనుమంత్ మాట్లాడుతూ... 9వ తేదిన పరిగి డిపోలో ఎన్నికల నియమాలను అతిక్రమించి పోలింగ్ ఏజెంట్ మాదిరిగా వ్యవహరించిన అతనిపై తగిన చర్య తీసుకోవాలన్నారు. తాండూర్ డిపో కండక్టర్ ఈ నెం -270830 రోజు జరిగిన ఆర్టీసీ యూనియన్ ఎన్నికల వెరిఫికేషన్ లో భాగంగా ఎన్నికలు సజావుగా జరుగుతున్న లేవా అని నేను అన్ని డిపోలను సందర్శిస్తూ పరిగి డిపోకు వెళ్లగా అక్కడ డిపో మేనేజర్ సెక్యూరిటీ గేటు దాటిన తర్వాత నీవు డిపోలోకి రావడానికి వీల్లేదు ఓన్లీ ఓటర్ మాత్రమే రావాలని నన్ను ఆపివేయడం జరిగిందన్నారు. కానీ దానికి నేను టీజేఎంయూ తరపున అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయో నేను చూడాలి తెలుసుకోవాలి అనగా నువ్వు రావాల్సిన అవసరం లేదు అని నన్ను అక్కడనే అడ్డగించి అక్కడినుండి వెళ్లిపోవాలని బెదిరించసాగాడు. అప్పుడు నేను డిపో మేనేజర్ తో మీరు డిపోకు మేనేజర్ ఎన్నికల విషయంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ తో నేను మాట్లాడుతా అంటే కూడా మాట్లాడనివ్వకుండా అన్ని నేనే చూసుకుంటా నిన్ను వెళ్ళనివ్వను ఏం చేసుకుంటావో చేసుకో అని అంటూ త్రోసేసి నన్ను అవమానించి బయటకు పంపించారన్నారు. పరిగి డిపో మేనేజర్ ప్రత్యక్షంగా ఎన్నికలలో ఇన్వాల్వ్ కావొద్దు కానీ డిపో మేనేజర్ కావాలని ఒక యూనియన్ కు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తూ ఎన్నికల నియమాలను అతిక్రమించి విధులు నిర్వహించారన్నారు. కౌంటింగ్ సమయంలో కూడా కౌంటింగ్ హాల్లో అన్ని నేనే అంటూ అక్కడే కూర్చుని కౌంటింగ్ పూర్తి అయ్యేంతవరకు అందులో ఉన్నారని, నేను చెప్పిన వారికే ఓట్లు వేయాలంటూ బయట ఆర్టీసీ కార్మికులతో మాట్లాడడం ఓటు లెక్కింపు వరకు కౌంటింగ్ హాల్లో అక్కడే ఉండడం చూస్తుంటే మొత్తము డిపో మేనేజర్ ఈయూ యూనియన్ ఏజెంట్ లాగా వ్యవహరించారన్నారు. లెక్కింపు అయిపోయిన తర్వాత కూడా వారితో పూలదండలు వేసుకొని ఆ యొక్క సంబరాలలో పాల్గొన్నారన్నారు. అంతేకాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత టీజేఎంయూ యూనియన్ వాళ్ళ అంత చూసుకుంటా ఏమి చేసుకుంటారో చూస్తా అని ప్రత్యక్షంగా బెదిరింపులకు వేధింపులకు పాల్పడుతున్నారు. పరిగి డిపో మేనేజర్ ఇషాక్ బిన్ మహ్మద్ ఎన్నికల కోడ్ అఫ్ డిసిప్లేన్ ను అతిక్రమించి డిపో మేనేజర్ డ్యూటీ వదిలి మొత్తము ఎన్నికల అయ్యేంతవరకు అక్కడ ఉండి ఎన్నికల ఏజెంట్గా ఎన్నికల కౌంటింగ్ సమయంలో కూడా అక్కడే ఫలితాలు వచ్చిన తర్వాత పూలదండలు వేసుకొని సంబరాలలో పాల్గొన్న డిపో మేనేజర్ విధుల నుండి సస్పెండ్ చేస్తూ తగిన చర్య తీసుకోగలరు న్యాయం చేయగలరని ఆయన కోరారు.